ఎన్టీఆర్ - త్రివిక్రమ్‌లు బాగా వాడుకున్నారు ... అందుకే ఆ మూవీ ప్రత్యేకం : పూజాహెగ్డే

ఆదివారం, 22 నవంబరు 2020 (09:40 IST)
ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఏలుతున్న హీరోయిన్లలో మంగుళూరు చిన్నది ఒకటి. తిరుగులేని స్టార్‌డమ్‌తో దూసుకెళుతోంది. ఈమె కాల్షీట్ల కోసం దర్శకనిర్మాతలు వేచి వుండాల్సిన పరిస్థితి నెలకొనివుంది. ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించే "రాధేశ్యామ్", నాగచైతన్య అక్కినేని నటిస్తున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" చిత్రాలతో పాటు మరో రెండు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. 
 
అయితే, గతంలో జూనియర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‍‌లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో ఈమె నటించింది. ఈ చిత్రం గురించి ఆమె స్పందిస్తూ, తాను ఇప్పటివరకు చేసిన తెలుగులో మూవీల్లో 'అరవింద సమేత వీరరాఘవ' తనకెంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చింది. నటనలో పరిణతి సాధించడంతో పాటు తొలిసారి తెలుగులో డబ్బింగ్‌ చెప్పడం మరచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని తెలిపింది. 
 
'ఎన్టీఆర్‌తో కలిసి తొలిసారి నటించడం గొప్ప అనుభూతిని పంచింది. మా ఇద్దరి ఎనర్జీలెవల్స్‌ ఒకటే కావడంతో తెరపై కెమిస్ట్రీ అద్భుతంగా పండిందనే ప్రశంసలొచ్చాయి. అన్నింటికంటే ముఖ్యంగా నటిగా నాలోని కొత్త కోణాల్ని ఈ సినిమా ఆవిష్కరించింది. నటనాపరంగా ఈ మూవీ నా కెరీర్‌లోనే ఉత్తమ చిత్రమని చెప్పొచ్చు. దర్శకుడు త్రివ్రిక్రమ్‌ ద్వారా ఎన్నో కొత్త విషయాల్ని నేర్చుకునే అవకాశం దొరికింది. అందుకే నా కెరీర్‌లో ఆ సినిమాకు ఎప్పుడు ప్రత్యేకస్థానం ఉంటుందని పూజా హెగ్డే వివరించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు