పూజా హెగ్డే అడుగుపెట్టినా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ను పట్టించుకోవట్లేదా?

శనివారం, 14 నవంబరు 2020 (12:02 IST)
Most Eligible Bachelor
అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో అఖిల్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. 
 
అఖిల్ నటించిన మూడు సినిమాలు అఖిల్, హలో, మిస్టర్ మజ్ను... చిత్రాలు ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోకపోవడంతో నాలుగవ సినిమా అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.అయితే.. దీనికి ఫామ్‌లో లేని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు కావడంతో సినిమా ఎలా ఉంటుందో..? ఈసారైనా అఖిల్‌కి విజయం వస్తుందో లేదో అని టెన్షన్ ఫీలవుతున్నారు.
 
ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే... అఖిల్ తదుపరి చిత్రాన్ని స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించనున్నారు. జనవరి నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
దీంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ గురించి అభిమానులు పట్టించుకోవడం మానేసారని టాక్ వినిపిస్తోంది. కారణం ఏంటంటే... అఖిల్‌ని స్టైలీష్ గా.. మాస్‌గా చూడాలనుకోవడంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌పై జనాలు ఆసక్తి చూపలేదట. కానీ తాజాగా దీపావళి కానుకగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ నుంచి పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు