బాహుబలి సినిమా ఏప్రిల్ 28వ తేదీన (శుక్రవారం) రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ప్రపంచ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బాహుబలి ది బిగినింగ్ సినిమాకు సీక్వెల్‌గా బాహుబలి ది కన్‌క్లూజన్ తెరకెక్కనున్న సంగతి విదితమే. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ సినిమా రివ్యూ లీక్ అయ్యింది.
హాలీవుడ్ సినిమా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 కంటే బాహుబలి 2 బాగుందని చెప్పారు. యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా వున్నాయని ప్రశంసల జల్లు కురిపించారు. ఈ దశాబ్ధపు అతిపెద్ద సినిమా ఇదవుతుందని.. థియేటర్‌లోనే ఈ సినిమా చూస్తే విజువలైజేషన్ ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్, రానాలు రెండు నట సింహాలు పోటీ పడిన తీరును చూపారని అన్నాడు. కొన్ని సీన్లలో చూస్తున్న ప్రేక్షకులు కంటతడి కూడా పెడతారని సెన్సార్ సభ్యుడు చెప్పుకొచ్చారు.
ఇకపోతే.. సోషల్ మీడియాలో బాహుబలికి చెందిన కీలక సీన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే రానాకు రాజమాత శివగామి స్వయంగా పట్టం కడుతున్న సీన్ చక్కర్లు కొడుతుండగా, ఈ చిత్రానికి చెందిన కథ కూడా లీకైపోయింది. అంతేగాకుండా దేవసేన (అనుష్క) కట్టప్ప కూతురేనని తేలింది. ఇదే ప్రస్తుతం బాహుబలి2లో అతిపెద్ద సీక్రెట్ అంటూ నెటిజన్లు పోస్టులను షేర్ చేసుకుంటున్నారు.