'బాహుబలి' మనోహరీ... ఎల్వీ రేవంత్‌కు ఇండియన్ ఐడల్ కిరీటం

సోమవారం, 3 ఏప్రియల్ 2017 (18:48 IST)
ఇండియన్ ఐడల్ పోటీల్లో మన తెలుగు తేజాలు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్‌లలో నిలవడం అద్భుతం. సోనీ టీవీలో ప్రసారం అవుతున్న ఇండియన్ ఐడల్ సీజన్-9 టైటిల్ కోసం ముగ్గురు పోటీపడ్డారు. వారిలో తెలుగు సింగర్ ఎల్‌వీ రేవంత్ దక్కించుకుని చరిత్ర సృష్టించాడు. ఆదివారం నాడు జరిగిన ఫైనల్ పోరులో రోహిత్, ఖుదా భక్ష్‌లతో పోటీ పడ్డ రేవంత్ విజేతగా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ రేంవత్ పేరును చెప్పడంతో అక్కడ కరతాళధ్వనులు మారుమ్రోగాయి. 
 
రేవంత్‌ విజేత అవడంతో ఇండియన్ ఐడల్ 9 ట్రోఫీతో పాటు రూ. 25 లక్షల నగదు బహుమతి అందుకున్నాడు. అంతేకాకుండా... యూనివర్సల్ మ్యూజిక్‌ కంపెనీ రేవంత్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రేవంత్ 1990 శ్రీకాకుళంలో జన్మించాడు. పాటలపై మక్కువతో హైదరాబాద్ చేరుకుని ఎన్నో కష్టాలు పడి నేడు ఇండియన్ ఐడల్ కిరీటాన్ని దక్కించుకున్న రేవంత్ బాహుబలి చిత్రంలోని " మనోహరీ..." అనే పాటను ఆలపించాడు. ఇండియన్ ఐడల్ ట్రోఫీతో తన జీవితం మారిపోయిందని అంటున్నాడు రేవంత్.

వెబ్దునియా పై చదవండి