ఆహా.. ఎన్నాళ్ళకెన్నాళ్లు... 'నర్తనశాల'లో సౌందర్య ఫస్ట్ లుక్

బుధవారం, 21 అక్టోబరు 2020 (18:29 IST)
తెలుగు చిత్రసీమకు చెందిన అగ్రహీరో నందమూరి బాలకృష్ణ నటించిన రీమేక్ చిత్రం "నర్తనశాల". ఈ చిత్రం కొన్నేళ్ళ క్రితం షూటింగ్ ప్రారంభించి ఆపేశారు. పైగా, ఈ చిత్రంలో ద్రౌపదిగా నటించిన అలనాటి నటి సౌందర్య కూడా హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఇపుడు ఈ రీమేక్ చిత్రాన్ని ఈ నెల 24వ తేదీన రిలీజ్ చేయనున్నారు. 
 
ఈ చిత్రంలో హీరో బాల‌కృష్ణ కీచ‌కుడు, అర్జునుడిగా రెండు పాత్ర‌ల్లో న‌టించ‌గా.. సౌంద‌ర్య ద్రౌప‌ది పాత్ర‌లో న‌టించింది. ఇప్ప‌టికే బాల‌కృష్ణ పాత్ర పోస్ట‌ర్ విడుద‌ల కాగా ప్రేక్ష‌కుల నుంచి అద్బుత‌మైన స్పంద‌న వ‌స్తోంది.
 
తాజాగా 'న‌ర్త‌న‌శాల' నుంచి ద్రౌప‌ది లుక్ విడుద‌లైంది. ద్రౌప‌ది పాత్ర‌లో సౌంద‌ర్య సూపర్బ్‌గా వుంది. సుమారు 17 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను శ్రేయాస్ ఈటీ యాప్‌లో అక్టోబ‌ర్ 24న విడుద‌ల చేయ‌నున్నారు. 
 
కాగా, 'న‌ర్త‌న‌శాల‌'లో బాల‌కృష్ణ‌, సౌంద‌ర్య‌తోపాటు శ్రీహ‌రి, శ‌ర‌త్‌కుమార్‌, ఉద‌య్ కిర‌ణ్, ఆశిన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సౌంద‌ర్య హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో అకాల మ‌ర‌ణం చెంద‌డంతో న‌ర్త‌న‌శాల ప్రాజెక్టును నిలిపివేసిన‌ట్టు బాల‌కృష్ణ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు