ఎట్ట‌కేల‌కు బోయ‌పాటికి బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడా? అయితే ప్రారంభం ఎప్పుడు.?

గురువారం, 8 ఆగస్టు 2019 (18:31 IST)
నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం కె.ఎస్.ర‌వి కుమార్‌తో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా వ‌చ్చే నెల మొద‌టి వారంలో ప్రారంభం కానుంది. విదేశాల్లో ఎక్కువ భాగం షూటింగ్ జ‌రుపుకునే ఈ సినిమాని డిసెంబ‌ర్ నెలలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
ఇదిలా ఉంటే... బాల‌య్య - బోయ‌పాటి సినిమా గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి కానీ.. అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేయ‌లేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... బోయ‌పాటికి బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. డిసెంబ‌ర్ నుంచి షూటింగ్ ప్లాన్ చేసుకోమ‌ని బోయ‌పాటికి చెప్పార‌ట‌. 
 
అయితే... ఈ క్రేజీ ప్రాజెక్టును ఎవ‌రు నిర్మిస్తార‌నేది మాత్రం తెలియాల్సివుంది. సింహా, లెజెండ్ చిత్రాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన బాల‌య్య‌, బోయ‌పాటి ఈసారి చేసే సినిమాతో ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టిస్తారో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు