చంద్రబాబుకు ఈ పరిస్థితి వచ్చిందంటే కడుపు రగిలిపోతుంది.. నిర్మాత బండ్ల గణేశ్

సోమవారం, 30 అక్టోబరు 2023 (08:10 IST)
ఒక విజనరీ లీడర్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే కడపు రగిలిపోతుంది... థూ.. దీనమ్మ అంటూ సినీ నిర్మాత బండ్ల గణేశ్ తీవ్ర భావేద్వోగానికి లోనయ్యార. హైదరాబాద్ నగరానికే తలమానికంగా ఉన్న సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా, భాగ్యనగరిలో ఆదివారం రాత్రి చంద్రబాబు గ్రాటిట్యూడ్ కాన్సెప్ట్ (కృతజ్ఞత సంగీత కచేరీ) నిర్వహించారు. ఇందులో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ బృందం తన సంగీత ప్రదర్శనతో సభకు వచ్చిన వారిని ఉర్రూతలూగించింది. 
 
ఇందులో సినీ నిర్మాత బండ్ల గణేశ్ పాల్గొని తీవ్ర భావోద్వేగంతో ప్రసంగించారు. ఓ దశలో ఆయన కంట తడి పెట్టారు. ఈ రోజున హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో ఇంతలా అభివృద్ధి చెందడానికి, మన పిల్లలు దేశ విదేశాల్లో ఐటీ రంగంలో ఉద్యోగాలు చేయడానికి పునాది వేసింది చంద్రబాబు నాయుడు అని అన్నారు. 
 
మా నాన్న వయసు 78 ఏళ్లు. చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశార్రా అని ఆయన అడిగారు. నాన్నా... కులీకుతుబ్ షా హైదరాబాద్‌ను కట్టాడు... 400 ఏళ్లయినా ఆయన పేరు చెప్పుకుంటున్నారు. అలాగే సైబర్ టవర్స్ కట్టిన చంద్రబాబును 4 వేల ఏళ్లయినా గుర్తుంచుకుంటారు అని చెప్పాను.
 
శ్రీకృష్ణుడు అంతటివాడికి కూడా జైలే జన్మస్థానం అయింది... శ్రీకృష్ణుడు దేవుడు కాకుండా పోయాడా!... అరణ్యవాసం వెళ్లిన రాముడు దేవుడు కాకుండా పోయాడా!... 40 రోజులుగా జైల్లో ఉన్నంత మాత్రాన చంద్రబాబు దేవుడు కాకుండా పోతాడా నాన్నా అని అన్నాను.
 
ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు జై అంటున్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, హైదరాబాదులో, ఢిల్లీలో ఆయనకు జై కొడుతున్నారు. కానీ చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉంటే కడుపు తరుక్కుపోతోంది. ఏం తప్పు చేశాడని ఆయనను జైల్లో పెట్టారు? మనందరికి భవిష్యత్ ఇచ్చినందుకా ఆయన జైల్లో ఉండాలి? ఆఖరికి భార్యాబిడ్డలను కూడా పక్కనబెట్టి ప్రజల కోసం పాటుపడిన చంద్రబాబుకు ఈ పరిస్థితి వచ్చిందంటే కడుపు రగిలిపోతోంది. చంద్రబాబు కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధమే. అలాంటి వ్యక్తి దేశానికి అవసరం అని బండ్ల గణేశ్ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు