Sudhakar Reddy, Arya, Ramajogaiah Shastri
ఆర్య కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కెప్టెన్'. ఐశ్వర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి, గోకుల్ నాథ్ ఇతర ప్రధాన తారాగణం. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహించారు. థింక్ స్టూడియోస్ అసోసియేషన్‌తో నిర్మాణ సంస్థ ది స్నో పీపుల్ పతాకంపై ఆర్య నిర్మించారు. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ & హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.