ఈ పాటకు శంకర్ మహదేవన్ అద్భుతమైన వోకల్స్ గొప్ప శక్తిని నింపింది. బెల్లంకొండ శ్రీనివాస్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తూ, శివుని ఫియర్, స్ట్రెంత్ రెండింటినీ కనబరిచారు. అతని ఎక్స్ ప్రెస్షన్స్, మూమెంట్స్ డివైన్ ఎనర్జీని అందించాయి. తన పాత్ర శివ తాండవం ప్రేరణ స్ఫూర్తితో మెస్మరైజ్ చేస్తోంది. క్యారెక్టర్ ఇంటెన్స్ పవర్ అద్భుతంగా వుంది.
ఈ చిత్రంలో నారా రోహిత్, మనోజ్ మంచు, అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ హరి కె వేదాంతం, ఎడిటింగ్ చోటా కె ప్రసాద్. ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాశారు.
భైరవం సమ్మర్ థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై