హై బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ ను బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి 'టైసన్ నాయుడు' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ను బాక్సింగ్ ఎక్స్ పర్ట్, లెజెండ్ మైక్ టైసన్ అభిమానిగా పరిచయం చేసే గ్లింప్స్ ప్రేక్షకులని కట్టిపడేసింది.
బాక్సింగ్ రింగ్‌లో నిలబడి, తనను తాను శక్తివంతుడిగా నిరూపించుకోవడానికి, తాను ఎగురుతూ ఎద్దును కొట్టగలనని గొప్పలు చెప్పుకునే సర్దార్ వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. సర్దార్ మాటతో కథానాయకుడు పగలబడి నవ్వి యాక్షన్ లోకి దిగుతాడు. హీరో DSP (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) గా పరిచయం అవుతాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్ టైసన్ మెరుస్తున్న పోస్టర్‌తో అతను బాక్సింగ్ రింగ్‌లోకి ప్రవేశించిన చివరి ఎపిసోడ్ ఆడియన్స్ కు మాస్ స్టఫ్ అందించింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మజల్ద్ బాడీ, గడ్డంతో మాస్‌గా కనిపించి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ బ్లాక్ ఇంటెన్స్, ఫేరోషియస్ గా వున్నాయి.
సాగర్ కె చంద్ర తన హీరోని అద్భుతంగా చూపించడంలో దిట్ట. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను మునుపెన్నడూ లేని మాస్, యాక్షన్ అవతార్‌లో చూపించాడు. ముఖేష్ జ్ఞానేష్ తీసిన విజువల్స్ అత్యద్భుతంగా ఉన్నాయి, సెన్సేషనల్ కంప్పోజర్ భీమ్స్ సిసిరోలియో తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో విజువల్స్‌ను మరింతగా ఎలివేట్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్ అత్యున్నతంగా వుంది.
ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా, కిరణ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. విజయ్, వెంకట్, రియల్ సతీష్ యాక్షన్ పార్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు.