శివ దర్శకత్వంలో, తాటి బాలకృష్ణ నిర్మాణంలో సీనియర్ నటీనటులు రఘుబాబు, పృద్వి, ప్రభావతి తదితరులు నటించారు.
ఈ సందర్భంగా నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ... ''ఈ మూవీ విలేజ్ బ్యాక్ గ్రౌండ్లో రూపొందిస్తున్నాం. రొమాంటిక్ లవ్ సస్పెన్స్ కామెడీ చిత్రం. సర్కార్ నౌకరి ఫేమ్ ఆకాష్ హీరోగా నటించే ఈ సినిమా కోసం హీరోయిన్ గా భైరవి తెలుగు తెరకు తొలి పరిచయం చేస్తున్నాం. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో భైరవి సరిగ్గా సరిపోతుంది. హీరోకి మరదలు పాత్ర చేస్తుంది. ఆమె పాత్ర సినిమాలో హైలైట్ గా ఉండబోతోంది. ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరిస్తుందని ఖచ్చితంగా చెప్పగలము. ప్రస్తుతం మా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నది. త్వరలోనే సినిమా టైటిల్, విడుదల తేదీ ప్రకటిస్తాం.'' అని అన్నారు.
నటీనటులు: ఆకాష్, భైరవి, రఘు బాబు, పృద్వి, ప్రభావతి, మహేందర్, డిడి శ్రీనివాస్, కిట్టయ్య తదితరలు.