ఈ ఏడాది మళ్లీ అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. అందరినీ ఆకట్టుకున్న కొత్త సీజన్ ప్రోమోను మేకర్స్ ఇప్పటికే విడుదల చేశారు. టీవీ నటులు అమర్‌దీప్ చౌదరి, తేజస్విని ఈసారి బిగ్ బాస్ 7 తెలుగు హౌస్‌లోకి ప్రవేశించబోతున్నారు.
అమర్‌దీప్ ఐరావతం, రాజుగారి కిడ్నాప్ వంటి సినిమాల్లో కనిపించాడు. తేజస్విని కూడా పలు సీరియల్స్‌లో నటిస్తోంది. తెలుగు, కన్నడ సీరియల్స్‌లో పనిచేస్తున్న టీవీ నటి శోభా శెట్టి కూడా బిగ్ బాస్ 7 తెలుగు పోటీదారుల్లో ఒకరు.
యాంకర్ విష్ణు ప్రియ, ఢీ షో పాండు, బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ పేర్లను కూడా బిగ్ బాస్ నిర్వాహకులు పరిశీలిస్తున్నారు. యూట్యూబర్ శ్వేతా నాయుడు, నిఖిల్ పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి.