శ్రీముఖి తర్వాత వరుణ్-వితిక జంటకే అధిక రెమ్యునరేషన్..? (Video)

శనివారం, 21 సెప్టెంబరు 2019 (16:33 IST)
బిగ్ బాస్ మూడో సీజన్‌లో తొలిసారి కపుల్స్ కంటిస్టెంట్లుగా వరుణ్ సందేశ్, వితికా షెరులు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షో సగానికి పూర్తయ్యింది. ఈ షో ప్రారంభంలో పెద్దగా ఈ జంట హైప్ క్రియేట్ కాలేదు. కానీ ఆ తర్వాత వరుణ్.. అతని సత్ప్రవర్తన తో ప్రేక్షకుల మనసు గెలుచుకొని ప్రస్తుతం హౌజ్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా.. ఈ సీజన్ ఫైనల్ వరకు వరుణ్ హౌజ్‌లో వుంటాడని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. 
 
ఇక వితిక విషయానికి వస్తే వరుణ్ వల్ల వితిక సేవ్ అవ్వుకుంటూ వస్తుంది తప్ప పెద్దగా తన ట్యాలెంట్ ను చూపించడం లేదు. వరుణ్ లేకుంటే మాత్రం వితిక ఎప్పుడో ఎలిమినేట్ అయ్యేదే. టాస్క్‌లో కూడా వితిక మిగితా వారికి పోటీ నివ్వకపోయిన ఎలిమినేషన్ నుండి మాత్రం ఇప్పటివరకు సేవ్ అవుతూ వచ్చింది. ఇకపోతే, ప్రస్తుతం ఈ జంట బిగ్ బాస్ హౌజ్‌లో ప్రవేశించేందుకు తీసుకున్న పారితోషికం గురించి పెద్ద చర్చ సాగుతోంది. 
 
ఇక ఈ జంట ఈ సీజన్ మొత్తానికి కలిపి పారితోషికం కింద రూ.28లక్షలు తీసుకుంటుంటున్నారట. ఇది పెద్ద మొత్తమేనని టాక్ వస్తోంది. బిగ్ బాస్‌కు రాకముందు వితిక ఎవరో పెద్దగా తెలియదు. కానీ బిగ్ బాస్ ఎంట్రీ కోసం ఈ జంట భారీగా తీసుకుందని చర్చ జరుగుతోంది. 
 
ఈ సీజన్ కంటెస్టెంట్లలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక వారానికి వరుణ్ సందేశ్ రూ.6లక్షలు తీసుకుంటుండగా, ఆయన భార్య వితిక షెరు వారానికి రెండు లక్షల మేర పారితోషికం తీసుకుంటున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు