'అత్తారింటికి దారేది' చిత్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌పై ఆ చిత్ర హీరో పవన్ కళ్యాణ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసిన విషయం ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రంలో నటించినందుకు తనకు రెమ్యునరేషన్ చెల్లించలేదని పేర్కొంటూ నిర్మాతపై ఫిర్యాదు చేయగా, ఇది ఆనాడు ఫిల్మ్ నగర్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు ముందు పవన్ కంప్లైంట్ చేయడం వల్ల ఇబ్బందులు పడ్డానని, అయితే అలాంటివి జరుగుతుంటాయని ఆయన వెల్లడించాడు. కాగా, ‘అత్తారింటికి దారేది’ సినిమాకు ముందు తలెత్తిన పైరసీ సంక్షోభం నుంచి తాను గట్టెక్కడానికి పవన్, త్రివిక్రమ్ ఎంతో సాయం చేశారని గుర్తు చేసుకున్నాడు.