నటుడిగా 300కిపైగా చిత్రాల్లో నటించారు. ఎత్తుకు పైఎత్తు చిత్రంతో నటుడు అయ్యారు.
నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపాన్ని తెలియజేశారు. ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్, డిసురేష్‌బాబు, రాజేంద్రప్రసాద్ వంటివారు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
బాలకృష్ణ సంతాపం
సీనియర్ నటులు మన్నవ బాలయ్యగారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. బాలయ్యగారు అద్భుతమైన నటులు. నాన్నగారితో కలిసి నటించారు. నా చిత్రాల్లోకూడా మంచి పాత్రలు పోషించారు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రతిభను చూపారు. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం వుంది. ఈరోజు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఆయన విత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
కుమారుడు తులసీరామ్ కూడా నటుడే
ఆయన నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా చెల్లెలి కాపురం (శోభన్ బాబు హీరో) నేరము - శిక్ష (కృష్ణ హీరో. కె. విశ్వనాథ్ దర్శకుడు) చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట (చిరంజీవి హీరో) లాంటి చిత్రాలు శ్రీ బాలయ్య నిర్మించారు.
దర్శకుడుగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు రూపొందించారు.
ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు.