‘చంద్రముఖి’లో కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ఎలాగైతే మిక్స్ అయ్యుంటాయో ‘చంద్రముఖి2’లోనూ అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. చంద్రముఖిని పలు భాషల్లో చేశారు. అయితే జ్యోతికగారు ఆ పాత్రను చాలా ఎఫెక్టివ్‌గా చేశారు. ఆమె నుంచి స్ఫూర్తి పొందాను. చంద్రముఖిలో జ్యోతికను చంద్రముఖి ఆవహిస్తుంది. కానీ ‘చంద్రముఖి2’లో నిజమైన చంద్రముఖి పాత్ర ఉంటుంది. దాని కోసం డైరెక్టర్ వాసుగారు కొత్తగా నా పాత్రను తీర్చిదిద్దారు. సెప్టెంబర్ 28న ‘చంద్రముఖి2’ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.