రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ మూవీ చంద్రముఖి 2. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ పి.వాసు తెరకెక్కించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 28న ఈ సినిమా విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో చంద్రముఖి 2 చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఈ సినిమా నుంచి సెకండ్ ట్రైలర్‌ను మేకర్స్ హైదరాబాద్ లో రిలీజ్ చేశారు.