మణిశర్మకు చిరంజీవి లిఫ్ట్... కొరటాల మూవీలో ఛాన్స్

మంగళవారం, 19 నవంబరు 2019 (15:49 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర సంగీత దర్శకుల్లో మణిశర్మ ఒకరు. ఒకానొకపుడు ఎన్నో హిట్స్ ఇచ్చారు. కానీ, దేవీశ్రీ ప్రసాద్, ఎస్ఎస్. థమన్‌ల ధాటికి తట్టుకోలేక కొంత వెనుకబడ్డారు. ఈ క్రమంలో ఆయనకు సినీ అవకాశాలు కూడా బాగా తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలోనే డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఆయనకు ఓ చాన్స్ ఇచ్చారు. "ఇస్మార్ట్ శంకర్" చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం విజయంలో మణిశర్మ సంగీతం ఎంతో కీలకపాత్ర పోషించింది. 
 
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిని బాలీవుడ్ పరిశ్రమ నుంచి ఎంపిక చేయాలని తొలుత భావించారు. అయితే, మనసు మార్చుకున్న చిత్ర యూనిట్ మణిశర్మపై దృష్టిసారించారట. ఈ ప్రతిపాదనకు చిరంజీవి సైతం సమ్మతించడంతో ఈ భారీ ప్రాజెక్టు మణిశర్మను వరించిందనే టాక్ ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. 
 
గతంలో ఎంతో అగ్ర హీరోల చిత్రాలకు సంగీతం సమకూర్చిన మణిశర్మ... ఇటు సంగీతం.. అటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను అందించడంలో సిద్ధహస్తుడు. అందువల్లనే ఈయనను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలోను ఆయన చిరంజీవికి ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఇలాంటి వాటిలో 'చూడాలని వుంది' చిత్రంలోని "రామ్మా చిలకమ్మా..", 'ఠాగూర్' చిత్రంలోని పాటలు ఇలా అనేకం ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు