ఇటీవలే హైదరాబాద్ లో ఓ స్టూడియోలో వేసిన సెట్లో ఆమె సన్నివేశాలు చిత్రీకరించారు. చిరంజీవి సార్ తో నటించడం కల నిజమైంది. విధి వల్లే నేను నటిస్తున్నాను. ఇందులో లంగా ఓణీ వేసుకునే పాత్రలో కనిపిస్తానని చెబుతోంది. ఇక మొదటి రోజు చిరంజీవి నా పనితనం గురించి అడిగారు. నటుడికి వుండ వలసిన లక్షణాలను తెలియజేశారు. బెరుకులేకుండా నటించమని చెప్పారు. ఆయన మాటలు స్పూర్తిగా తీసుకున్నాను. కొన్ని డేసీ షూటింగ్ తర్వాత, ఆమె ఇప్పుడు విరామం తీసుకుంటోంది. త్వరలో మరో షెడ్యూల్ లో పాల్గొననుంది.