ఈ సందర్భంగా హీరో సంతానం మాట్లాడుతూ.. డీడీ రిటర్న్స్ తమిళ్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నా సినిమా తెలుగులో విడుదల చేయడం నా డ్రీం. మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూశాను. సినిమా విడుదలైతే అందరూ ఎంజాయ్ చేసేలా వుండాలని అనుకున్నాను. ఇప్పుడు డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా చిత్రంతో తెలుగులోకి రావడం ఆనందంగా వుంది. అందరూఎంజాయ్ చేసే చిత్రమిది. తెలుగు ప్రేక్షకులకు రియల్ సినిమా లవర్స్. ఇక్కడి ప్రేక్షకుల ప్రేమ ప్రోత్సాహంతో ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ని సాధించింది. ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఆర్ బి చౌదరి గారు , ఎన్ వి ప్రసాద్ గారి కి ధన్యవాదాలు. భూతాల బంగ్లా చిత్రం ఒక రోలర్ కోస్టర్ ఫన్ రైడ్. హారర్ కామెడీ విత్ గేమ్ తో వున్న ఈ చిత్రాన్ని పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా యునిక్ గా వుంటుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఆగస్ట్ 18 ఈ చిత్రం మీ ముందుకు వస్తోంది. ఈ మంచి చిత్రాన్నితెలుగు ప్రేక్షకులు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.
సురభి మాట్లాడుతూ.. తమిళనాడులో డీడీ రిటర్న్స్ పెద్ద హిట్ అయ్యింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. మీ అందరితో కలసి డీడీ రిటర్న్స్ ని థియేటర్ లో చూడటానికి ఎక్సయిటెడ్ గా వున్నాను. సంతానం గారితో పని చేయడం గొప్ప అనుభవం. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. టీం అంతా కలసి చాలా హార్డ్ వర్క్ చేశాం. అందరూ ఆగస్ట్ 18న ఈ చిత్రాన్ని థియేటర్ లో చూడాలి అన్నారు
దర్శకుడు యస్. ప్రేమ్ ఆనంద్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి చిత్రం. తమిళ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం ఆనందంగా వుంది. ఈ చిత్రం తెలుగులో విడుదల కావడం గౌరవంగా భావిస్తున్నాను. రమేష్ గారి, ఎన్వీ ప్రసాద్ గారికి, ఆర్బీ చౌదరి గారికి ధన్యవాదాలు. సంతానం గారికి తెలుగు ప్రేక్షకులతో ఎంతో మంచి అనుబంధం వుంది. రాజమౌళి గారి ఈగ తమిళ్ వెర్షన్ సంతానం గారు కీలక పాత్ర పోషించారు. దానికి నేను డైలాగ్స్ రాశాను. ఇప్పుడు అదే టీం ఈ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. యస్. డీడీ రిటర్న్స్ చాలా జాయ్ ఫుల్ మూవీ. ఫ్యామిలీ, కిడ్స్ ప్రత్యేకంగా ఎంజాయ్ చేస్తారు. ఆగస్ట్ 18న సినిమా విడుదలౌతుంది. అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి అని కోరారు.