చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

ఠాగూర్

ఆదివారం, 2 మార్చి 2025 (09:38 IST)
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్ ప్రభుత్వం గౌరవం పౌరసత్వం ఇస్తోందంటూ వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆయన బ్రిటన్ పౌరసత్వం స్వీకరించబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. దీనిపై చిరంజీవి పీఆర్ టీమ్ స్పందించింది. 
 
చిరంజీవిగారు బ్రిటన్ దేశపు గౌరవ పౌరసత్వం అందుకోబోతున్నారంటూ వస్తున్న కథనాల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఇటువంటినిరాధార వార్తలు ప్రచురించేటపుడు మీడియా సంస్థలు ఓసారి నిర్ధారణ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. 
 
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత వశిష్ట దర్శకత్వంలో "విశ్వంభర" చిత్రంలో నటిస్తున్నారు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ నటించేందుకు చిరంజీవి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

 

Reports of Megastar #Chiranjeevi Garu receiving honorary UK citizenship are false. We request news outlets to verify before publishing any such news.

— Beyond Media (@beyondmediapres) March 1, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు