మెగా పిచ్చి పీక్స్.. థియేటర్లలో హంగామా... గుంటూరులో థియేటర్‌పై దాడి

బుధవారం, 11 జనవరి 2017 (09:49 IST)
అభిమాన హీరో సినిమా రిలీజైతే ఫస్ట్ షో చూడాలని చాలామంది ఆరాటపడతారు. ఇందుకోసం ఎంత రేటు పెట్టైనా టికెట్ కొనుగోలు చేసి సినిమాకి వెళ్లడం మనం చూస్తుంటాం. ప్రశాంతంగా ఖైదీ నంబర్ 150 సినిమాని థియేటర్‌లో మూవీ చూడాలని భావించిన వారికే ఫస్ట్ షోకే కాసింత ఇబ్బందులు ఎదురయ్యాయి.
 
తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని భ్రమరాంబ థియేటర్‌లో ఇది మెగాస్టార్ ఫ్యాన్స్ హంగామా. సినిమా మొదలుకాకముందే ఈలలు, గోలలతో థియేటర్ అంతా బర్త్ డే వేడుకల మాదిరిగా తయారైంది. ఫ్యామిలీతో ఆ థియేటర్‌కి వెళ్లినవారు కాస్త అసౌకర్యానికి గురి చేసింది. ఇదేకాదు.. చాలా థియేటర్స్ ముందు ఇదిగో ఇలా...
 
మరోవైపు.. గుంటూరు జిల్లాలో ఖైదీ నెం.150 సినిమా విడుదల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అర్థరాత్రి తర్వాత గుంటూరు జిల్లా కొల్లూరులో పెద్ద హైడ్రామానే నడిచింది. కొల్లూరులోని శ్రీనివాస థియేటర్‌ ఎదుట అభిమానులు ఆందోళనకు దిగారు. అర్థరాత్రి ఒంటిగంటకు ఖైదీ నె౦.150 సినిమా బెనిఫిట్‌ షో వేస్తామని చెప్పి తెల్లవారే వరకు షో వేయకపోవడంతో అభిమానులు ఆగ్రహించారు.
 
థియేటర్‌లో తెరను చించి, కుర్చీలు ధ్వంసం చేసి అభిమానులు నానా రచ్చ చేశారు. ఈ చర్యతో అవాక్కైన థియేటర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్‌ చేసి అభిమానులను చెదరగొట్టారు. 'ఖైదీ నెం.150' సినిమా చూడాలని ఎంతో ఆశతో తాము థియేటర్ ముందు రాత్రంతా పడిగాపులు కాస్తే, థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అభిమానులు ఆరోపించారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. 

వెబ్దునియా పై చదవండి