మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్”. రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇటీవల హైదరాబాద్‌లో హై-ఆక్టేన్ ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను పూర్తి చేసారు. దానితో 80% షూటింగ్ పూర్తయింది.
మే డే సందర్భంగా చిరంజీవి వింటేజ్ మాస్ లుక్‌లో కనిపించే మూడు కొత్త పోస్టర్‌లను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లలో మెగాస్టార్ గ్రే కలర్ యూనిఫాంలో టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తున్నారు. ఓ పోస్టర్ లో టీ టైమ్‌ని ఆస్వాదిస్తూ కనిపించారు. ఛార్మింగ్ స్మైల్ తో యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తున్నారు మెగాస్టార్.
చిరంజీవి, కీర్తి సురేష్, తమన్నా, వెన్నెల కిషోర్, ఇతరులతో కూడిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోల్‌కత్తాలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చిరంజీవి, తమన్నాలపై ఓ పాటను చిత్రీకరించేందుకు యూరప్ వెళ్లనున్నారు. మహతి స్వర సాగర్ రాకింగ్ నెంబర్ ని స్కోర్ చేశారు. యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్ షూట్, భారీ సెట్ సాంగ్ చిత్రీకరిస్తాం. దాంతో జూన్ నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ & యాక్షన్ సమపాళ్లలో వుండనున్నాయి.
తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్, చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.