షాలు సమ్ము అనే యంగ్ నటి.. క్యాస్టింగ్ కౌచ్‌పై షాక్ ఇచ్చే నిజాలు వెల్లడించింది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో, అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండతో నటించే అవకాశమిస్తా.. తనతో పడకపంచుకోవాలని ఓ దర్శకుడు తనకు ఆఫర్ ఇచ్చినట్లు వెటకారంగా తెలిపింది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే షాలు.. వీడియోలను, ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో #MeToo లాంటి ఘటన సినీ జీవితంలో ఎదురైందా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇన్‌స్టాగ్రామ్‌లో షాలు అవుననే సమాధానం ఇచ్చింది. ఇంకా షాకింగ్ నిజాన్ని కూడా చెప్పేసింది.
తాజాగా విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఇప్పిస్తానని.. అలా ఆ ఛాన్స్ దక్కాలంటే.. తనతో పడక పంచుకోవాల్సిందేనని ఓ దర్శకుడు చెప్పాడని షాలు వెల్లడించింది. ప్రస్తుతం షాలు ఆరోపణలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల ఈమె తన బాయ్‌ఫ్రెండ్‌తో చేసిన గ్లామర్ డ్యాన్స్ నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.