పుష్ప 2 షూటింగ్‌పై క్లారిటీ అప్‌డేట్‌ - తగ్గేదేలే అంటున్న దేవిశ్రీప్రసాద్

బుధవారం, 2 ఆగస్టు 2023 (12:18 IST)
pupshpa2
అల్లు అర్జున్‌ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్నసినిమా పుష్ప2. మొదటి భాగం ప్రపంచస్థాయిలో పేరుపొందింది. అనూహ్యంగా ఇతర భాషల్లోనూ క్రేజ్‌తెచ్చుకుంది. దర్శకుడు సుకుమార్‌ క్రియేటివ్‌ మైండ్‌తో ఈ సినిమాను ఈసారి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే పనిలో వున్నారు. ఇటీవలే వర్షాలవల్ల మదనపల్లి, మారేడుమిల్లి ప్రాంతాల్లో షూటింగ్‌ వాయిదా వేశారు. కొంతభాగం కేరళలోనూ చేయాల్సింది సాధ్యపడలేదని తెలిసింది. తాజాగా ఈ సినిమా మారేడుమిల్లిలో జరుగుతోంది. ఇప్పటివకు యాభైశాతం షూటింగ్‌ పూర్తయిందని చిత్ర యూనిట్‌ తెలియజేస్తుంది.
 
Devisreeprasad
ఇందులో సంగీతం సమకూర్చిన దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు నేడో. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌడ్ మ్యూజిక్, బేజియమ్స్ విషయంలో తగ్గేదేలే అంటూ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ఓ ఐటం సాంగ్‌ కోసం శ్రీలీలను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ శ్రీలీలకు దాదాపు పది సినిమాలు చేతిలో వుండడంతో ఇందులో నటించడానికి కుదరలేదని తెలుస్తోంది. పూజా హెగ్డేను సుకుమార్‌ సంప్రదింపులు జరుపుతున్నా, ఆమెకు మహేష్‌బాబు గుంటూరు కారంలో ఐటం సాంగ్‌కు రెడీ అయినట్లు వార్తలు రావడంతో అదీ సాధ్యపడలేదు. ఇక ఎవరనేది త్వరలో తెలియనుంది. కాగా, ఈ సినిమాను 2024 మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు