రామ్‌చరణ్, ఉపాసన దంపతులు అప్పుడప్పుడు గొడవలు పడుతుంటారట. ఈ విషయాన్ని ఉపాసన కొణిదెల తెలియజేస్తుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను ట్వీట్ చేసింది. చరణ్‌తో వున్న ఎనిమిది సంవత్సరాలను తెలిపారు. అప్పడప్పుడు మా మధ్య సందర్భాన్ని బట్టి బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటాం. నేను వ్యాపార రంగంతోపాటు సామాజిక సేవలో బిజీగా వున్నా, చరణ్ షూటింగ్‌లో బిజీగా వున్నా మా మధ్య ప్రేమకు కొదవలేదు.