బాలీవుడ్ నటుడు జితేంద్ర లేటు వయస్సులో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 50 సంవత్సరాల క్రితం ఓ హోటల్‌లో తనను వేధించారని బాధితురాలు హిమాచల్ ప్రదేశ్ పోలీసులకు లేఖ రాసింది. అంతేగాకుండా కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు రెండు పేజీల లేఖ రాసింది. అయితే ఇవి బేస్‌లెస్ ఆరోపణలంటూ నటుడి తరపు న్యాయవాది కొట్టిపారేశారు.
50 ఏళ్ల క్రితం ఓ హోటల్‌లో తనను జితేంద్ర లైంగికంగా వేధించారని బాధితురాలు ఆ లేఖలో పేర్కొంది. అప్పట్లో 28 ఏళ్ల వయస్సున్న జితేంద్ర 18 ఏళ్ల వయసున్న తనను లైంగికంగా వేధించారని లేఖలో బాధితురాలు పేర్కొంది. అయితే బాధితురాలి ఆరోపణలను జితేంద్ర తరపు న్యాయవాదులు కొట్టిపారేశారు. ఇదో అర్థం పర్థం లేని ఆరోపణ అంటూ తోసిపుచ్చారు.
1971లో ఓ షూటింగ్‌లో భాగంగా జితేంద్ర తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. షూటింగ్ స్పాట్ నుంచి కారులో ఎక్కించుకుని ఢిల్లీ నుంచి ఓ హోటల్‌కు తీసుకెళ్లారని.. వేర్వేరు పడకలు ఉండగా అక్కడే నిద్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాగా అలసిపోయిన తాను తనువు మరిచి నిద్రపోయానని.. అయితే కాసేపటి తర్వాత మెలకువ వచ్చి చూసేలోపు జితేంద్ర తన పడకపై తనపక్కనే వున్నారని తెలిపింది.