Daaku Maharaaj : డాకు మహారాజ్‌తో బాలయ్య ఒకే ఒక్కడు.. ప్రపంచ రికార్డ్ నమోదు

సెల్వి

మంగళవారం, 14 జనవరి 2025 (15:14 IST)
బాబీ దర్శకత్వం వహించిన నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్.. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు సానుకూల స్పందన వచ్చింది. తాజాగా డాకు మహారాజ్ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.56 కోట్లు వసూలు చేశాడు. ఇది బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక ఓపెనర్‌గా నిలిచింది.
 
బాలయ్య నటనతో ఈ చిత్రం ఇప్పటికే యుఎస్ బాక్సాఫీస్ వద్ద ఒక మిలియన్ మార్కును దాటింది. తద్వారా బాలకృష్ణ నటించిన ఈ సినిమా అమెరికాలో 1 మిలియన్ మైలురాయిని అధిగమించింది. 
 
అఖండ, వీరసింహారెడ్డి భగవంత్ కేసరి తరువాత అత్యధిక రికార్డులతో డాకు మహారాజ్ అమెరికాలో ఒక మిలియన్ మార్కును దాటిన ఏకైక టాలీవుడ్ హీరోగా బాలయ్య నిలిచాడు. తద్వారా వరుసగా అమెరికాలో నాలుగు 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన హీరోగా బాలయ్య ఖాతాలో మరో రికార్డు క్రియేట్ చేశారు. 
 
డాకు మహారాజ్ చిత్రం ఫస్ట్ డే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో కలిపి దాదాపు రూ. 25.75 కోట్ల షేర్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 32.85 కోట్ల షేర్‌తో పాటు రూ. 56 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు