టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ''డియర్ కామ్రేడ్'' హిందీ డబ్బింగ్ సినిమాకు యూట్యూబ్‌లో భారీ స్పందన లభించింది. ఇటీవల కొన్ని తెలుగు చిత్రాలను అనువాదం చేసి హిందీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో అల్లు అర్జున్, రామ్ పోతినేని, బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రాలు, నితిన్ సినిమాలు వందల మిలియన్ల వ్యూస్‌ను రాబట్టిన సంగతి తెలిసిందే.