సమాజంలో మగాడికి ఎంత గౌరవం ఉందో మహిళలకు కూడా అంతే గౌరవం ఉండాలి. ఇద్దరిలో ఎవరూ తక్కువ, ఎక్కువగా కాదని కంగనా వ్యాఖ్యానించింది. తనకు తోచిన విషయాన్ని బోల్డ్‌గా చెప్పేసే కంగనా రనౌత్ అంటే బాలీవుడ్ హీరోలు సైతం జడుసుకుంటారు. గతంలో హృతిక్ రోషన్‌ను ఎక్స్ అని వివాదంలో నిలిచిన కంగనా రనౌత్ నిన్నటికి నిన్న బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్‌ను కూడా మూవీ మాఫియా అన్నది.
దీనిపై లేటెస్టుగా కరణ్ జోహార్ స్పందించారు. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌కు కంగనా గెస్టుగా వచ్చిందని.. అందుచేత ఆమె ఏది చెబితే అది వినాల్సి వుంటుందని తెలిపాడు. ఎప్పుడూ తనకేదో అన్యాయం జరిగిపోతుందనే విధంగా కంగనా రనౌత్ బాధపడుతుంటుందని.. ఆమె వ్యవహారంతో తాను పూర్తిగా విసిగిపోయానని చెప్పాడు. ప్రతి సందర్భంలోనూ కేవలం ఒకే వ్యక్తి అన్యాయానికి గురికావడం ఉండదని తెలిపాడు. సినీ పరిశ్రమ అంత చెడ్డదిగా కనిపిస్తే.. వదిలేసి వెళ్ళిపోవచ్చునని కూడా సలహా ఇచ్చాడు.