ప్రియాంక చోప్రా రేంజే పూర్తిగా మారిపోయింది. హాలీవుడ్లో క్వాంటికో సీరియల్ సక్సెస్ కావడంతో పాటు బేవాచ్ మూవీలో హీరోయిన్గా ఎంపిక కావడం.. పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ గెలుచుకోవడం ఆస్కార్ ఈవెంట్లో ప్రెజెంటర్‌గా వ్యవహరించడం, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో డిన్నర్.. ఇలా అన్నీ కలిసి ప్రియాంకను మోస్ట్ డిజైరబుల్ విమన్ 2015 జాబితాలో అగ్రస్థానంలో నిలబెట్టాయి. మొత్తం 21.35 లక్షల మంది పాల్గొన్న ఈ ఓటింగ్ లో.. అత్యధిక భాగం ప్రియాంకకే మొగ్గారు.
ప్రియాంక చోప్రాకు తర్వాతి స్థానంలో అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకునే ఉండగా, పోర్న్ స్టార్, బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ మూడో స్థానంలో నిలిచింది. ఇక తర్వాతి స్థానాల్లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నాలుగో స్థానంలో నిలవగా, వర్తికా సింగ్ ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇదే జాబితాలో దక్షిణాది హీరోయిన్ శ్రియా చరణ్ ఆరో స్థానంలో నిలవడం గమనార్గం. 7, 8, 9, 10 స్థానాల్లో శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్, అమీ జాక్సన్, కంగనా రనౌత్‌లు నిలిచారు. ఇకపోతే.. దీపికా పదుకునే, ప్రియాంక చోప్రాలు త్వరలో బాండ్ సినిమాల్లో ఛాన్స్ దక్కించుకునే అవకాశం ఉందని హాలీవుడ్ వర్గాల్లో వార్తలు షికారు చేస్తున్నాయి.