ఎన్.టి.ఆర్. దేవర నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులు పొందిన కరణ్ జోహార్

డీవీ

బుధవారం, 10 ఏప్రియల్ 2024 (14:45 IST)
ntr - Koratala Siva - KaranJohar and others
ఉత్తరాదిలో నటుడి, నిర్మాత, పంపిణీదారుడిగా పేరు గన్న  కరణ్ జోహార్ చేతికి ఎన్.టి.ఆర్. దేవర నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులు లభించాయి. ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో తెలియజేశారు. నార్త్ కు చెందిన  ధర్మమూవీస్, AA ఫిల్మ్స్ఇండియా సంస్థలకు ఈ హక్కులు లభించాయి. వీటి అధినేత కరణ్ జోహార్.
 
అక్టోబరు 10న థియేటర్లలో భూకంపానికి సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేశాడు. గతంలో బాహుబలి సినిమాను కూడా ఆయన తన భుజాలపై వేసుకున్నారు. ఇప్పటికే దేవర సినిమాపై పలు అప్ డేట్స్ వచ్చాయి. తాజాగా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది.  ఈ సందర్భంగా వారు ఎన్.టి.ఆర్. దర్శకుడు కొరటాల శివ చిత్ర నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ లతో కలిశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు