స్టూడెంట్స్ ముందు స్పీచ్ ఇస్తున్న ధ‌నుష్‌

గురువారం, 28 జులై 2022 (17:59 IST)
Sir-dhanush
తాజాగా త‌మిళ హీరో ధ‌నుష్ న‌టిస్తున్న సినిమా `సార్‌`. వెంకీ అట్లూరి తో చేస్తున్న డైరెక్ట్ సినిమా ఇది. ఈరోజు ధ‌నుష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌చేసింది. ఇందులో ధ‌నుష్ లెక్చ‌ర‌ర్‌గా న‌టిస్తున్నాడు. ఈరోజు విడుద‌ల చేసిన స్టిల్‌లో  ధనుష్ తన స్టూడెంట్స్ ముందు ఏదో చెబుతున్న‌ట్లు కనిపిస్తున్నాడు అలాగే బ్యాక్గ్రౌండ్ లో సరస్వతి దేవి విగ్ర‌హం పెట్ట‌డంతో మరింత ఆసక్తి రేపుతోంది. ఈరోజు సాయంత్ర‌మే టీజ‌ర్‌నుకూడా విడుద‌ల‌చేయ‌నున్నారు.
 
సార్' అక్టోబర్ లో విడుదలకానుంది. తెలుగు, తమిళ భాషల్లో తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని, రానున్న రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు, విశేషాలు వెల్లడి చేయనున్నట్లు తెలిపారు నిర్మాత నాగవంశీ. 
 
తారాగ‌ణం: ధ‌నుష్‌, సంయుక్తా మీన‌న్‌,సాయికుమార్,తనికెళ్ల భ‌ర‌ణి
, సముద్ర ఖని,తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార,ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు