వెంకీ అట్లూరి దర్శకత్వం లో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం 'సార్'(తెలుగు) 'వాతి',(తమిళం) చిత్ర నిర్మాణం ముగింపు దశలో ఉన్నది. ఈ చిత్రాన్ని వచ్చేఏడాది 2023, ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ఇందులో కథానాయకుడు ధనుష్ కళాశాల మెట్లమీద ఎంతో స్టైలిష్ గా కూర్చుని ఉన్న వైనం అభిమానుల్ని అలరిస్తుంది. అలాగే ఇటీవల చిత్రం నుంచి విడుదల అయిన మాస్టారు మాస్టారు గీతం చాట్ బస్టర్స్ లో అగ్రగామిగా నిలవడంతో పాటు, చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు సార్ పై ప్రపంచ సినిమా వీక్షకులలో అమితాసక్తి కలిగించాయి. విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీద సాగే ఈ చిత్రంలో స్పృశించే అంశాలు, సన్నివేశాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు, ఆలోచింప చేస్తాయి.
తెలుగు, తమిళ భాషల్లో 'సార్' 17 ఫిబ్రవరి, 2023 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది అని చిత్ర నిర్మాతలు తెలిపారు.
తారాగణం: ధనుష్, సంయుక్తా మీనన్, సాయికుమార్, తనికెళ్ల భరణి
, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, సార, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి, ప్రవీణ తదితరులు.
మ్యూజిక్: జి.వి. ప్రకాష్‌కుమార్
యాక్షన్ కొరియోగ్రాఫర్: వెంకట్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
నిర్మాతలు: నాగవంశీ ఎస్. - సాయి సౌజన్య
రచన- దర్శకత్వం: వెంకీ అట్లూరి
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్