అఖిల్ మూవీని రికార్డు రేటుకు కొన్నారా..?

బుధవారం, 5 ఆగస్టు 2020 (19:35 IST)
అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతుండటం విశేషం. మూడు బ్యాక్ టు బ్యాక్ నిరాశల తరువాత, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌తో విజయం సాధించడంపై అఖిల్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ చిత్రం షూట్ చివరి దశలో ఉంది.
 
సంక్రాంతి 2021 విడుదలను లక్ష్యంగా పెట్టుకుంది. అయితే... మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నాన్-థియేట్రికల్ రైట్స్ సేల్ చేయడం అయ్యిందని తెలిసింది. ఈ మూవీ శాటిలైట్ హక్కులు రూ. 6.5 కోట్లుకు అమ్మినట్టు సమాచారం, ఇది అఖిల్ సినిమాల్లో అత్యధికం. స్టార్ మా టీవీ రికార్డు ధరకి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. 
 
బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. GA2 పిక్చర్స్ బ్యానర్లో రూపొందుతోన్న ఈ మూవీ మూడు వారాల షూట్ పెండింగ్‌లో ఉంది. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి.. శాటిలైట్ రైట్స్‌తో రికార్డు క్రియేట్ చేసిన అఖిల్ మూవీతో బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డు క్రియేట్ చేస్తాడని ఆశిద్దాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు