దిల్ వాలే దుల్హనియా లేజాయాంగే.. ఒకే థియేటర్‌లో 25 ఏళ్లు.. లండన్‌లో..? (Video)

మంగళవారం, 20 అక్టోబరు 2020 (15:24 IST)
Dilwale Dulhania Le Jayenge
బాలీవుడ్ హిట్ చిత్రం దిల్ వాలే దుల్హనియా లేజాయాంగే సినిమాకు అరుదైన అవార్డు దక్కింది. ఈ సినిమా 1995లో విడుదలై బంపర్ హిట్ అయ్యింది. కథా పరంగానూ, పాటల పరంగానూ అదరగొట్టింది. సినీ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా మిగిలిపోయింది. అసలు దిల్ వాలే దుల్హనియా లేజాయాంగే సినిమా గురించి తెలియని భారతీయ ప్రేక్షకుడు ఉండడంటే అతీశయోక్తి కాదు. 
 
1995లో విడుదలైన ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమ రికార్డులను చెరిపేయడమే కాదు. ఓ కొత్త ట్రెండ్ ని కూడా సృష్టించింది. తాజాగా ఈ సినిమా యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. పాత రికార్డులన్నీ చెరిపేసింది. కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్‌లో ఈ సినిమా 15 సంవత్సరాలపాటు ఆడింది. దీనిని బట్టి  సినిమా క్రేజ్ ఏంటో తెలుసుకోవచ్చు. 
 
ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే ఒక సినిమా ఇన్నేళ్లపాటు థియేటర్‌లో కంటిన్యూగా ఆడటం ఇదే మొదటిసారి. ఆఖరి సారి కూడా. అంత గొప్ప చిత్రానికి ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్ 20తో ఈ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. 
 
ఈ సందర్భంగా లండన్‌లోని సీన్స్ ఇన్ స్క్వేర్‌లో ఈ చిత్రంలో నటించిన హీరో షారుక్ ఖాన్.. హీరోయిన్ కాజోల్ కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు హార్ట్ ఆఫ్ లండన్ బిజినెస్ అలయన్స్ ఓప్రకటన చేసింది. అయితే వచ్చే ఏడాది విగ్రహాలను ఆవిష్కరించనున్నట్టు ప్రకటించింది. దీంతో ఓ భారతీయ సినిమా స్థాయి ప్రపంచస్థాయికి వెళ్లిపోయింది. ఆదిత్యా చోప్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు