పవన్ కల్యాణ్ నా దేవుడు, కానీ ఎవర్నీ నమ్మొద్దు, ఏమైంది గణేశన్నా? ఆడియో షేర్ చేసావేంటన్నా?

శనివారం, 18 జూన్ 2022 (13:43 IST)
బండ్ల గణేష్. టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా దేవుడు అనీ, ఆయనంటే నాకు పిచ్చ అని ఏ వేదిక పైనుంచైనా చెపుతుంటారు. అలాంటిది అకస్మాత్తుగా శనివారం నాడు ఓ ఆడియో ట్విట్టర్లో పోస్ట్ చేసారు. ఆ సారాంశం విన్న ఫ్యాన్స్ కామెంట్ల మీద కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. కొన్నిటిపై ఇష్టాన్ని పెంచుకుని నా అనుకునేవాళ్లకి అన్యాయం చేయొద్దు.

 
మనలను నమ్మి వచ్చిన భార్యను, పిల్లలను ప్రేమిద్దాం.'' అంటూ ఓ ఆడియో పోస్ట్ చేసాడు. ఈ ఆడియోను విన్న నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. ఏమైంది గణేశన్నా... ఉన్నట్లుండి హఠాత్తుగా ఈ ఆడియోలు ఏమిటి... ఆ సందేశాలు ఏమిటి? ఏదేనా ఎదురుదెబ్బ తగిలిందా, ఇండస్ట్రీలో ఎవరైనా మోసం చేసారా... అంటూ పలు రకాలు కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఆడియోలో ఏమున్నదంటే... జీవితంలో తల్లిదండ్రులు, భార్యాపిల్లల్ని తప్ప ఇంకెవ్వరినీ నమ్మొద్దు.

pic.twitter.com/gmM8wdXfJb

— BANDLA GANESH. (@ganeshbandla) June 18, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు