వీర ధీర శూర సినిమా బిగినింగ్ మిస్ కావొద్దు, ముందు సీక్వెల్ విడుదల: చియాన్ విక్రమ్

దేవీ

శనివారం, 22 మార్చి 2025 (19:35 IST)
Chiyaan Vikram, S.J. Surya, Dushara Vijayan, NVs prasad
చియాన్ విక్రమ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ వీర ధీర సూరన్. వైవిధ్యంగా పార్ట్-2 విడుదల చేస్తున్నాం. ఆ తర్వాత ప్రీక్వెల్ వుంటుంది. అందుకే సినిమా బిగినింగ్ మిస్ కావొద్దు అని చియాన్ విక్రమ్ తెలియజేశారు. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్  కీలక పాత్రలు పోషిస్తున్నారు.  H.R. పిక్చర్స్ రియా శిబు నిర్మించిన ఈ చిత్రం మార్చి 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
 
హీరో విక్రమ్ మాట్లాడుతూ, యాక్షన్ తో పాటు మంచి ఎమోషన్ ఉన్న సినిమా ఇది. ఇలాంటి సినిమాలు చేయడానికి మంచి పెర్ఫార్మర్స్ కావాలి. ఈ సినిమా కోసం మేము ఫస్ట్ అప్రోచ్ అయిన యాక్టర్ సూర్య. ఆయన ఇందులో క్యారెక్టర్ చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ క్యారెక్టర్ కి సూర్య అయితేనే పర్ఫెక్ట్ . నేను ఎస్ జె సూర్య సినిమాలకి బిగ్ ఫ్యాన్ ని. యాక్టర్ గా ఆయన చాలా అద్భుతమైన పాత్రలు చేస్తున్నారు. ఒక పాత్రతో మరో పాత్రకి చాలా వైరుధ్యం ఉంటుంది. యాక్టర్ గా ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. 
 
ఈ సినిమాలో సూర్య గారితో కలసి యాక్ట్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ . తుషార గారు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్ మెమొరబుల్ గా ఉంటాయి. పృద్వి గారికి ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ప్రసాద్ గారు లక్కీ హ్యాండ్. ఆయన మా సినిమాని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది డిఫరెంట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ . డైరెక్టర్ అరుణ్ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. ఒక ఆడియన్స్ ఇలాంటి సినిమాని చూడడానికి ఇష్టపడతాను. జీవి ప్రకాష్ కుమార్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు . ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని గ్రాండ్ గా నర్మించారు. 
 
తెలుగులో అన్ని రకాల సినిమాలు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తున్నాయి. యాక్టర్స్ కి ఇది చాలా గొప్ప అవకాశం. అన్ని రకాల పాత్రలు చేసే ఛాన్స్ ఉంటుంది . తెలుగు ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమ అద్భుతం. వారి ప్రేమకి నా కృతజ్ఞతలు. మార్చి 27న ఈ సినిమా వస్తోంది.  ఇది అందరూ ఎంజాయ్ చేసే సినిమా కచ్చితంగా మీరంతా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమా ఫస్ట్ షాట్ నుంచే కథ మొదలైపోతుంది. అందుచేత ఒక ఫైవ్ మినిట్స్ ముందే థియేటర్ లో వుండేలా చూసుకోవాలని ప్రేక్షకులుని కోరుతున్నాను'అన్నారు.  
 
యస్ జె సూర్య మాట్లాడుతూ, మంచి కంటెంట్ ఎక్కడున్నా సరే తెలుగు ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. హాలీవుడ్ డైరెక్టర్ మార్టిన్ స్కోర్సెస్ అంటే డైరెక్టర్ అరుణ్ గారికి చాలా పిచ్చి. ఒకవేళ మార్టిన్ స్కోర్సెస్ రాజమండ్రిలో సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. రంగస్థలం లాంటి రా అండ్ రస్టిక్ సినిమా ఇది. 

 ఈ సినిమాలో 16 మినిట్స్ డ్యూరేషన్ గల ఒక సింగిల్ షాట్ ఉంది. ఆ షాట్ కోసం చాలా రిహారల్స్ చేశారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక రాత్రంతా ఆ షాట్ తీస్తూనే ఉన్నాం. ఆ షాట్ గురించి చెప్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి. నిజంగా మీరు థియేటర్స్ లో చూడాల్సిందే. మీలానే నేను విక్రమ్ గారికి అభిమానిని. విక్రమ్ గారు లాంటి యాక్టర్ ఉండడం మన సౌత్ ఇండస్ట్రీకి గర్వకారణం. ప్రేక్షకులకి మంచి సినిమా ఇవ్వాలనే ప్రేమతో ఈ సినిమా చేశాం. కచ్చితంగా ఆడియన్స్ ఒక మంచి హిట్ ఇస్తారనే నమ్మకం ఉంది. తిరుపతి ప్రసాద్ గారు ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి ప్రేక్షకులు చాలా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను'అన్నారు.
 
హీరోయిన్ తుషారావిజియన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా కోసం అందరం చాలా హార్డ్ వర్క్ చేసాము. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. లవ్ యు ఆల్. థాంక్యూ'అన్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు