గత కొద్దిరోజులు హైదరాబాద్ లోని సౌందర్య ఆస్తి గురించి మోహన్ బాబుకు లింక్ చేస్తూ వస్తున్న వార్తలనుబట్టి నేను స్పందిస్తున్నాను. ఆదారాలులేని నిరాధారమైన ఆరోపణలను నేను ఖండిస్తున్నాను. అందుకే నా భార్య సౌందర్య ఆస్తి విషయంలో మోహన్ బాబుకు ఎటువంటి సంబంధంలేదని చెబుతున్నాను. నాకు తెలిసిన దాన్ని బట్టి మోహన్ బాబుకూ, సౌందర్యకు ఎటువంటి లాండ్ విషయంలో లావాదేవీలు జరగలేదు.
గత 25 సంవత్సరాలుగా మోహన్ బాబుగారితో సత్ సంబంధాలున్నాయి. నేను, నా భార్య, నా బావమరిది వారితో మంచి రేపో వుంది. అందుకే అసలు నిజం ఏమిటో చెప్పాలని నేను మీడియాకు తెలియజేస్తున్నాను. కను మోహన్ బాబుతో ఎటువంటి లాండ్ వివాదం కానీ, లావాదేవీలు కానీ జరగలేదు. దయచేసి ఇటువంటి తప్పుడు వార్తలను ప్రచురించకుండా చూడాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇకపై ఇటువంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాలని విన్నవించుకుంటున్నానని. రఘు తెలియజేశారు.