పాతకాలంనాటి టీనేజ్ రొమాన్స్‌ను, ఆ కాలంలో ఇద్దరు ప్రేమికులు సమాజంలో ఎదుర్కొన్న ఇబ్బందులను సినిమాలో చూపించబోతున్నారు. యశ్ రంగినేని, మధురా శ్రీధర్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. తాజాగా 'దొరసాని' టీజర్ గురువారం విడుదలై, వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.