గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ట్రైలర్ రికార్డు.. 3,840,660 వ్యూవ్స్ రికార్డ్

సోమవారం, 19 డిశెంబరు 2016 (09:39 IST)
నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ట్రైల‌ర్‌ శుక్రవారం అట్టహాసంగా విడుదలైన సంగతి తెలిసిందే. కరీంనగర్ జిల్లా కోటిలింగాల ప్రాంతంలోని కోటేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక‌పూజ‌లు నిర్వ‌హించిన తర్వాత క‌రీంన‌గ‌ర్‌లోని తిరుమ‌ల థియేట‌ర్లో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ బాహుబలికి మించిందని.. ఇప్పటికే టాలీవుడ్‌లో టాక్ వచ్చేసింది. 
 
ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్‌, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం విడుదలకు ముందే సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. ట్రైలర్‌ అప్‌లోడ్‌ చేసిన రెండు రోజుల్లోనే 3.5 మిలియన్‌ మార్క్‌ సాధించింది. 
 
ఒకవైపు చారిత్రక నేపథ్య కథనం.. మరోవైపు బాలయ్య వందో చిత్రం కావడంతో నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. దాంతో యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో టాప్‌లో నిలిచింది. విడుదలైంది మొదలు టాప్‌లోనే నిలవడం గమనార్హం. సోమవారం ఉదయం 9 గంటలకు 3,840,660 వ్యూవ్స్ రికార్డ్ అయ్యాయి.

వెబ్దునియా పై చదవండి