కరోనాకు ముందు ఆ తర్వాత కూడా మంచి పాత్రలు, పెద్ద బేనర్లల సినిమాలో చేస్తున్నా. రామ్‌చరణ్, శంకర్ సినిమాలో మంచి పాత్ర పోషిస్తున్నా. మరోవైపు వెబ్ సిరీస్‌లోకూడా నటిస్తున్నా. ఇంకా చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. దానికి పారితోషికం డిమాండ్ లేకుండా చేస్తున్నా. ఇది అమ్మ నుంచి నేర్చుకున్నానంటూ పేర్కొన్నారు. త్వరలో మా అమ్మపేరుతో నిర్మాణరంగంలోకి రాబోతున్నానని చెప్పారు.