గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

డీవీ

సోమవారం, 20 జనవరి 2025 (21:09 IST)
Padmavathi Malladi
ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్‌ సమర్పకురాలు. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు నిర్మాతలు.

ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు పద్మావతి మల్లాదితో జరిపిన ఇంటర్వూ ఇది.
 
మీ నేపథ్యం?
నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. నేను చదివే స్కూల్‌కు మా అమ్మే ప్రిన్సిపాల్‌. స్కూల్‌తో పాటు ఇంట్లోనే తన్నులు తినేదాన్ని. పీజీ పూర్తిచేసిన తరువాత చంద్రశేఖర్‌ యేలేటి దగ్గర రచన విభాగంలో పనిచేశాను. రాధేశ్యామ్‌కు కూడా రచయితగా పనిచేశాను. ఆ సమయంలోనే మహానటి సినిమాకు రైటర్‌గా పనిచేసే అవకాశం వచ్చింది. చూసి చూడగానే సినిమాకు డైలాగ్స్‌ రాశాను. అమ్ము అనే సినిమాకు కూడా పనిచేశాను. బృంద అనే వెబ్‌ సీరిస్‌కు రచయితగా వర్క్‌ చేశాను.
 
గాంధీ తాత చెట్టు చిత్ర కథ మీలో ఎలా చిగురించింది?
నా స్నేహితుడు చెట్టుకు,  మనిషికి లవ్‌స్టోరీ రాస్తే బాగుంటుంది అనడంతో నాకు ఆ ఐడియా బాగా నచ్చింది. నాకు కూడా స్వతహాగా పచ్చదనం, చెట్లు అంటే చాలా ఇష్టం. ఈ లైన్‌కు నేను బాగా కనెక్ట్‌ అయ్యాను. మొక్కల గురించి తదుపరి తరం వాళ్లకు చెప్పాలనే సంకల్పంతో ఈ కథ రాసుకున్నాను. ఒక అమ్మాయి అహింసవాదంతో  ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేది కథ ఇది. పూర్తి సందేశంతో పాటు కమర్షియాలిటి ఉన్న సినిమా. తప్పకుండా అందరి హృదయాలకు హత్తుకుంటుంది. ఇది కేవలం అవార్డ్‌ సినిమా కాదు. అందరికి నచ్చే కమర్షయాలిటీస్‌, ఎమోషన్స్‌ ఉన్న సినిమా.
సినిమా చిత్రీకరణ ఎక్కడ చేశారు?
మొదట నా కథ నేపథ్యానికి తగిన వరల్డ్‌ క్రియేట్‌ చేద్దామని నిజామాబాద్‌కు వెళ్లాను. నిజామాబాద్‌ ఫ్రెండ్‌ ఫామ్‌లో నా కథకు కావాల్సిన చెట్టు దొరికింది. చెరుకు తోట ఉన్న ఊరు రంగంపేట అనే ఊరిలో చిత్రీకరణ కూడా చేశాం. నా కథ 1947లో గాంధీగారు చనిపోయినప్పుడు తాత నాటిన చెట్టుతో ప్రారంభమవుతుంది.
 
పీరియాడికల్‌ నేపథ్యం ఎందుకు సెలక్ట్‌ చేసుకున్నారు?
నేను కథ రాసుకున్నప్పుడే నేను పదవ తరగతి చదువుతున్న టైమ్‌లో కథ నడుస్తున్న నేపథ్యాన్ని ఎంచుకున్నాను.  ఈసినిమా చిత్రీకరణ చాలా నేచురల్‌గా జరిగింది. ఈ చిత్రీకరణ జరుగుతున్న రెండో రోజే తబితా సుకుమార్‌ సమర్పణలో చేద్దామని ఆమె డిసైడ్‌ చేసుకున్నారు.
 
సుకుమార్‌ కూతురు ఈ సినిమా కోసం వర్జినల్‌గా గుండు చేయించుకున్నారని తెలిసింది?
పొస్తటిక్‌ మేకప్‌ అనేది అంత ఈజీకాదు. దానికి తగిన బడ్జెట్‌ లేదు. అంతేకాదు కథలో అమ్మాయి పాత్ర కూడా చాలా ధైర్యవంతురాలైన పాత్ర. ఇలాంటివి అని పట్టించునే అమ్మాయి కాదు. అమ్మాయిలకు జుట్టు చాలా ఇంపార్టెంట్‌ కానీ సుకృతి నా కథ తగ్టట్టుగా డేరింగ్‌ డిసిషన్‌ తీసుకుంది.
 ఈసినిమాలో గాంధీ పాత్రకు సుకృతినే ఎందుకు సెలెక్ట్‌ చేసుకున్నారు?
నా కథలో అమ్మాయి నాకు సుకృతిలోనే కనిపించిది. గాంధీ పాత్రకు పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యింది. అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రివ్యూ చూసినప్పుడు థియేటర్‌లో  సుకృతిని చూశాను. అప్పుడు మాకు అనిపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫోటోలు చూసి.. సుకుమార్‌, తబితా గారి అనుమతితో సెలెక్ట్‌ చేశాం.
సుకృతి నటన చాలా సహజంగా అనిపిస్తుంది? ఆమె ఎలాంటి హొమ్‌వర్క్‌ చేసింది?
రెండు నెలలు వర్క్‌షాప్‌ చేశాం. అన్ని ముందే రిహార్సల్‌ చేసేది. 25 రోజుల్లో చిత్రీకరణ చేయాడానికి తగిన ప్రణాళికతో ముందుకెళ్లాం. మొత్తం ప్లానింగ్‌తో  వేళ్లాం. ఎంతో ఇన్‌వాల్వ్‌మెంట్‌తో సుకృతి చేసేది.
ఈ సినిమా కోసం సుకుమార్‌ గారి సలహాలు ఏమైనా?
ఇది సపరేట్‌ జానర్‌.. నీవు ఎలా తీయాలో అలాగే తీయ్యి. నేను నిన్ను నమ్ముతున్నాను. అన్నారు సుకుమార్‌ సార్‌..
 
ఈ పినిమాకు సంగీతం ప్రాధానత్య ఎలా ఉంది?
పాటలతో పాటు , రీ రికార్డింగ్‌కు చాలా ప్రాధాన్యత వుంది. కళ్లు మూసుకున్న ఆ నేపథ్య సంగీతంతో కథ అర్థం అయ్యే విధంగా ఉంటుంది.
ఇది కేవలం గాంధీ మీద నడిచే కథేనా?
గాంధీ అనే అమ్మాయి గురించి ఈ కథ. గాంధీ గారి సిద్దాంతాలు ఆ పాత్రలో  ఉంటాయి. అలా అని పూర్తిగా గాంధీ గారి బయోపిక్‌ కాదు ఇది. గాంధీ, తాత, చెట్టు ఈ మూడింటి కథ ఈ సినిమా.
ఈ పినిమా ద్వారా ఏమీ చెప్పబోతున్నారు?
ఈ సినిమాతో అహింస గురించి చెప్పాను. మనుషుల మధ్య, నేచర్‌ మధ్య అహింస చాలా అవసరం.
 
అవార్డ్స్‌ గెలిచిన తరువాత సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు? ఎందుకని?
ఇది సుకుమార్‌ సార్‌ ఐడియా. ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో మంచి అప్లాజ్‌ వచ్చింది. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని అనుకుంటున్నాను. అవార్డ్ష్‌ వల్ల సినిమాలకు రెస్పెక్ట్‌ పెరిగింది. పంపించిన ప్రతి ఫెస్టివల్‌లో అవార్డ్‌ వచ్చింది,
 
ఈ సినిమాకు ఉన్న అదనపు ఆకర్షణలు ఏమిటి?
ఈసినిమాలో ఆ ఊరిలో జనాలతో యాక్ట్‌ చేయించాం. అందరూ అక్కడి వాళ్లే. ఎంతో సహజంగా నటించారు. వాళ్లు నటించడం సినిమా ఎంతో సహజంగా రావడానికి ఉపయోగపడింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు