బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ ఈ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తుండగా, ఇందులో మరో నటి కనిపించనుంది. ప్రముఖ మోడల్ గాయత్రీ భరద్వాజ్ ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది. నూపూర్‌కి లాగే గాయత్రీ భరద్వాజ్‌కి కూడా ఇది మొదటి సినిమా. సినిమాలో ఇద్దరు హీరోయిన్లకూ నటించేందుకు మంచి స్కోప్ ఉంటుంది.
గాయత్రీ భరద్వాజ్ fbb కలర్స్ ఫెమినా మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2018గా ఎంపికైంది. ఆమె సెఫోరా మిస్ గ్లామరస్ లుక్, జియో మిస్ పాపులర్, కొడాక్ లెన్స్ మిస్ స్పెక్టాక్యులర్ ఐస్, మిస్ ఇండియా ఢిల్లీ 2018 మొదలైన టైటిళ్లను కూడా గెలుచుకుంది. ఆమె నటించిన వెబ్ సిరీస్ దిండోరాలో తన నటనకు ప్రశంసలు అందుకుంది.
టైగర్ నాగేశ్వరరావు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనుంది. స్టూవర్ట్‌పురంలో పేరుమోసిన నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వరరావు రవితేజకు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం. ఇది రవితేజకు మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్.