ప్రభాస్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈరోజే ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. రాధేశ్యామ్ ఈనెల 11న అంటే రేపు భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. పాన్ ఇండియాగా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఇటీవలే ఆంధ్రలో టికెట్ రేట్ల గురించి ప్రభాస్ కూడా ఎ.పి. ప్రభుత్వాన్ని కలిశారు. ఇక తెలంగాణాలో కలవకుండానే సినిమా పరిశ్రమకు కె.సి.ఆర్. ప్రభుత్వం ఆఫర్లు ఇస్తుంది. ఈ సినిమా ఐదో ఆటకు అనుమతిస్తూ ప్రభుత్వం అనుమతి జారీ చేసింది.