'ఫ్రెండ్‌షిప్'లో ర‌జినీ ఆంథెమ్‌ను హిట్ చేసిన ఫ్యాన్స్‌కి థాంక్స్: హ‌ర్భ‌జ‌న్ సింగ్

మంగళవారం, 7 జులై 2020 (18:14 IST)
ప్ర‌ముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్ హీరోగా న‌టిస్తోన్న `ఫ్రెండ్‌షిప్` సినిమాలోని సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఆంథెమ్‌ను రాఘవ లారెన్స్ విడుదల చేశారు. సంగీత ద‌ర్శ‌కుడు డి.ఎమ్ ఉద‌య‌‌కుమార్ ఇచ్చిన క్యాచీ ట్యూన్స్‌కి రాజశ్రీ సుధాక‌ర్ లిరిక్స్ రాయ‌గా హేమ చంద్ర పాడిన ఈ హుషారైన పాటతో సూప‌ర్‌స్టార్ ర‌జినీ కాంత్‌కి ప‌ర్ఫెక్ట్ ట్రిబ్యూట్ ఇచ్చారు ‘ఫ్రెండ్‌షిప్‌’  చిత్ర యూనిట్‌. సూప‌ర్ స్టార్ ఆంథెమ్ అన్ని భాషల్లో విశేషంగా ఆకట్టుకుని ట్రెండింగ్‌లో టాప్‌గా నిలిచింది.
 
ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ మాట్లాడుతూ, " 'ఫ్రెండ్‌షిప్` సినిమాలోని సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ ఆంథెమ్‌ను బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు నా ఫ్యాన్స్‌కు థాంక్స్. మీ ఆదరాభిమానాలతో టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది. సినిమా చాలా బాగా వచ్చింది." అన్నారు.
 
త‌మిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌ నేస‌న్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రల‌లో యాక్షన్ కింగ్ అర్జున్, స‌తీష్‌ న‌టిస్తున్నారు. జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జెపిఆర్ & స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, త‌మిళ‌, ఇంగ్లీష్ భాషల‌లో విడుద‌ల కాబోతున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్:  వేల్‌మురుగ‌న్‌, రాబిన్‌, ప్రొడ్యూస‌ర్స్: జెపిఆర్ & స్టాలిన్, 
ద‌ర్శ‌క‌త్వం: జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు