బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్ దంపతులు చూడముచ్చటగా ఉంటారనే విషయం తెలిసిందే. ప్రస్తుతం షాహిద్ రంగూన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఉడ్తా పంజాబ్ ప్రమోషన్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో షాహిద్ మాట్లాడుతూ.. తన భార్య, తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ప్రస్తుతం మీరా గర్భవతిగా ఉందని.. పెళ్లయిన తర్వాత తన భార్య చెప్పినట్లే వింటున్నానని.. పెళ్లయ్యాక తన పరిస్థితి కట్టేసిన కుక్కలా ఉందని చెప్పుకొచ్చాడు. తన భార్య చెప్పినట్లు వింటూ ఒక పరిధిలోనే నడుచుకుంటూ బాధ్యతగా వ్యవహరించడానికి కారణం తన భార్యేనని షాహిద్ కపూర్ తనదైన శైలిలో వెల్లడించాడు. తమకు పుట్టబోయే బిడ్డ.. పాపైనా, బాబైనా పర్లేదని.. తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నాడు.