ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ ఒకేలా వుంటుంది. ఒకరు ప్రేమను అంగీకరించడం, మరొకరు తిరస్కరించడం, మనస్పర్థలు రావడం, విడిపోవడం, మళ్ళీ కలవడం ఇలాంటి పరిస్థుతులే వుంటాయి. అయితే ఆ కథని ఎంత యూనిక్ గా చెబుతున్నామనేది ఇక్కడ ముఖ్యం. కాదల్, రోజా, ముంబై, ఓకే బంగారం.. ఇలా ఈ చిత్రాల థీమ్స్ సిమిలర్ గా ఉండొచ్చు. అయితే దర్శకుడు ఆ కథని ఎలా చెప్పారనే దానిపైనే వైవిధ్యం ఆధారపడి వుంటుంది. సంగీతం కూడా అలానే వుంటుంది. ప్రేమ పాటల్ని విన్నప్పుడు ఒకే ఎమోషన్ వుంటుంది. హాయిగా, రొమాంటిక్ గా ఫీలౌతాం. అయితే ఆ పాట ఎవరు పాడారు, అక్కడ ఎలాంటి సాహిత్యం, సందర్భం వుందనేది కొత్త క్రియేషన్ తీసుకొస్తుంది అని హాయ్ నాన్న చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ అన్నారు.