Sampat nandi, tamanna, sharva, madhu
తమన్నా భాటియా మూవీ 'ఓదెల 2'. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చార్మింగ్ స్టార్ శర్వా చీఫ్ గెస్ట్ గా హాజరై ఇలా మాట్లాడారు.