తనకు దేశభక్తి ఉందని చెప్పింది. కానీ ఈ వ్యవహారంలో కేవలం నటీనటులను ఎందుకు టార్గెట్ చేయాలని ప్రశ్నించింది. దేశంలో ఏం జరుగుతుందో అంతా తెలుసు. కానీ రాజకీయంగా ఎలాంటి ఘటనలు జరిగినా లక్ష్యం చేసేది నటీనటులు, కళాకారులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అడిగింది.
వ్యాపారవేత్తలని, రాజకీయ నాయకులని, వైద్యులని ఎందుకు వేలెత్తి చూపరు? భారత్ తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటాను. కానీ ఈ విషయంలో పాక్ నటీనటులు ఎవరికీ ఎలాంటి హానీ కలిగించలేదు. అలాంటప్పుడు వారికి వ్యతిరేకంగా ఉండలేం కూడా అంటూ ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారు. ఒకరు చేసిన పనికి వారినే శిక్షించాలి కానీ, వారి స్థానంలో కళాకారులని శిక్షించాలనుకోవడం తప్పు అని ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించింది.
జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను పాటిస్తున్నామని.. అహింసకు కట్టుబడి ఉంటామని ప్రియాంక చోప్రా తెలిపింది. సైనికులకు, వారి కుటుంబాలకు భద్రత కల్పించడంపై మనం శ్రద్ధ వహించాలి. నిర్వర్తించాల్సిన బాధ్యత గురించి మరిచిపోయి అనవసరమైన వాటిపై ఎక్కువగా చర్చిస్తుంటామని అభిప్రాయాలను తెలిపింది.